ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌

ఆయుధం న్యూస్ హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా గురువారం నాడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద సీనీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ నివాళులు అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.