మే3న నిర్వహించిన నీట్ యూజీ- 2026 పరీక్ష రద్దయ్యింది. ప్రశ్నపత్రం లీక్ వార్తల నేపథ్యంలో ఎన్టీయే ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్ష కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కొత్త పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఫీజు చెల్లించనక్కర్లేదని తెలిపింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. రాజస్థాన్లోని కోటాలో నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకైనట్లు అధికారులు గుర్తించారు.