ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో మహిళా వారోత్సవాలు

ఆయుధం న్యూస్ వరంగల్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో మహిళా వారోత్సవాలలో భాగంగా ఖిలా వరంగల్ మండలంలోని పుప్పాలగుట్ట పీహెచ్‌సీలో నిర్వహించిన స్క్రీనింగ్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సోమవారం సందర్శించారు.ఈ సందర్శనలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి క్యాంపులో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలను పరిశీలించారు.మహిళల ఆరోగ్య సంరక్షణ అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, ప్రతి మహిళ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన...