బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు

ఆయుధం న్యూస్ హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పిలుపునిచ్చారు.నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు పూర్తి సహకారం అందించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అధ్యక్షతన ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ శాసనసభ్యులు,మాజీ శాసనసభ్యులు, ఇన్‌చార్జీలు,సమన్వయకర్తలతో సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం జరిగింది.ఈసమావేశంలో హరీష్ రావు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ పలు సూచనలుచేశారు.జిల్లాలో...