AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 11:28 am Posted by : AYUDAM DAILY

బొల్లికుంటలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం

ఆయుధం న్యూస్
గ్రేటర్ వరంగల్ నగరంలోని బొల్లికుంట గ్రామంలో 60 లక్షల రూపాయాలతో నిధులతో చేపడుతున్న పలు అభివృద్ది పనులకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహాత్ బాజ్ పాయి, సత్య శారద జిడబ్లుఎంసి మాజీ మేయర్ మేయర్ గుండు సుధారాణిలతో కలిసి శనివారంనాడు శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకం ద్వారా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్లు, తాజా మాజీ మేయర్ పాల్గొని, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలినారు.ఈ కార్యక్రమంలో బల్లియా ఇంజనీరింగ్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.