భారత దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.హన్ మాన్,రామాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది.జై హనుమాన్,జై శ్రీరామ్ నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. తెలంగాణలో కొండగట్టు అంజన్న, గీసుకొండ మండలం కొనాయమాకుల పంచముఖ హన్ మాన్ దేవాలయంలో హన్ మాన్ దీక్షలోఉన్న స్వాములు మాలవిరమణ చేశారు. ఉమ్మాడి వరంగల్ జిల్లాలో దేవాలయాల్లో హన్ మాన్ భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హన్మకొండ ప్రసిద్ద వేయిస్థంభాల ఆలయంలో ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ అద్వర్యంలో ప్రత్యక పూజలు నిర్వహంచారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.