ఆయుధం న్యూస్ వరంగల్
విద్యార్థులు ప్రతినిత్యం యోగా సాధన చేస్తే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ లయన్ చంద్రశేఖర్ ఆర్యా అన్నారుగ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి యోగ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఆదివారం నాడు జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు బొలిశెట్టి కమలాకర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యా మాట్లాడుతూ యోగాను ప్రతినిత్యం సాధన చేసినట్లయితే ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా ఉంటారని ఆయన ఉన్నారు ఈ వేసవి శిక్షణ శిబిరంలో నేర్చుకున్న యోగ ఆసనాలను ప్రతినిత్యం ఇంటి వద్ద సాధన చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు. జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు కమలాకర్ మాట్లాడుతూ రంగశాయిపేటలో గత కొన్ని సంవత్సరాలుగా వేసవికాలంలో ఎలాంటి ఫీజులు తీసుకోకుండా ఉచితంగా యోగాను పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గతంలో శిక్షణ పొందినవారు జాతీయస్థాయి యోగా క్రీడాకారులుగా ఎదిగారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు దామోదర్ మాట్లాడుతూ యోగ క్యాంపులో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు నేర్చుకోవడం వల్ల యోగ విన్యాసాలను అలవోకగా వేస్తున్నారని ఆయన అన్నారు. యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాకాల రవీందర్ మాట్లాడుతూ ఈ వేసవి శిక్షణ శిబిరంలో శారీరక వ్యాయామంతో పాటు యోగ చేయడం వల్ల మానసిక ప్రశాంతత విద్యార్థులకు చేకూరిందని శిక్షణ శిబిరం ముగిసిన తర్వాత కూడా ప్రతిరోజు కొంత సమయం వెచ్చించి యోగ సాధన చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు. కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మండల నర్సింహులు మాట్లాడుతూ యోగ సాధన తో పాటు చదువుల్లో విద్యార్థులు రాణించాలని ఆయన అన్నారు. హన్మకొండ జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు కిషన్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు వేకువజామునే యోగ సాధనకు పంపించిన తల్లిదండ్రులకు ఇక్కడ నేర్చుకున్న విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేశారు.ఈ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ హాజరైన అతీథులు ప్రధానం చేశారు. ఈకార్యక్రమంలో రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు కత్తి.కుమారస్వామి వ్యాయామ ఉపాధ్యాయులు పాషా వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ కోశాధికారి అడప.సాంబశివరావు యోగశిక్షకులు కోట.రజిత, ఆడపజ్యోతి, అడప.అభినవ నేతాజీ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.