శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి: సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత

ఆయుధం న్యూస్ హన్మకొండ శాంతియుత వాతావరణంలో పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో మతపెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ ను నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండగలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని డీసీపీ ఆకాంక్షించారు. ప్రజలంతా పండుగలను మతసామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చేయాలన్నారు.పండుగ ఏ మతానిది అయిన సామరస్యత...