శ్రీవరదదత్త క్షేత్రంలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు.
గ్రేటర్ వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు ప్రాంతంలోగల శ్రీగణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆశ్రమం లొని కార్యసిద్ది ఆంజనేయస్వామీకి భక్తులు ఉత్సవ మూర్తికి సామూహికంగా చందనం అభిషేకం నిర్వహించారు. మూలమూర్తి శ్రీ కార్యసిద్ధి ఆంజనేయస్వామీకీ అర్చకులు రాపాక గోపికృష్ణ శర్మ చందనం,తెనే,పాలు,పంచ అమృతం,సుగంధ ద్రవ్యంతో అభిషేకంచేసారు స్వామీకి అలంకరణ అనంతరం 1008 వడలతో వాడమాలసేవ ఆకు పూజలు చేశారు. నైవేద్యం నివేదన మహా మంగళ హారతి ఇచ్చారు అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాదం...