ఆయుధం న్యూస్ హన్మకొండ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పురస్కరించుకొని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హనుమకొండ జిల్లాలో రాంపూర్ పరిశ్రమల సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ శాస్త్రవేత్త నోడల్ అధికారి బి. జీముత వాహన మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాలలో పరిశ్రమల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యత, కార్పొరేట్ పర్యావరణ బాధ్యతను ప్రోత్సహించడం,సుస్థిర పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహించడం అనే అంశాలపై పరిశ్రమల యజమానులు ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్గించారు.ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను తగ్గించడం, పర్యావరణ కార్యక్రమాలలో సీఎస్ఆర్ అవకాశాలపై తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండలోని రాంపూర్ ఐడిఎ పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు ఎస్. వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి. వెంకటేశ్వరరావుఇతర కార్యవర్గ సభ్యులతో పాటు, పారాబాయిల్డ్ రైస్ మిల్లులు, టైర్ పైరోలిసిస్ యూనిట్లు, వస్త్ర పరిశ్రమ యూనిట్లు, గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ యూనిట్లు, ఫార్మా పరిశ్రమ, సాల్వెంట్ రికవరీ యూనిట్, ఆర్ ఎంసీ యూనిట్లు ఆహార శుద్ధి యూనిట్ల పరిశ్రమల యజమానులు, ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.