ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మహిళలు వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ఆయుధం న్యూస్ వరంగల్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా మరింత ముందుకు సాగాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ (అడ్మిన్) సమ్మయ్య అన్నారు.ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME) పథకం లబ్ధిదారుల కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, మెప్మా ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిల్ హాల్‌లో నాలుగు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా...