మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సీతక్క

ఆయుధం న్యూస్ ములుగు గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత, మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.గురువారంనాడు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం గ్రామంలో మహిళా సంఘాల సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మండలంలోని ఆరు మహిళా సంఘాల సమాఖ్య భవనాల నిర్మాణానికి...