నాలుగోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ ఓట్ల తొలగింపుకు కుట్రలు చేస్తోంది

ఆయుధం న్యూస్ హన్మకొండ దేశంలో వరుసగా నాలుగోసారి కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రజల తీర్పుతో గెలిచే పరిస్థితి లేకపోతే, ఓటర్ల జాబితాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే బీజేపీ కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమానికి శాసనసభ్యులు కె.ఆర్.నాగరాజుతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా SIR (Special...