పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయ ఉత్పత్తులను వాడాలి

ఆయుధం న్యూస్ హన్మకొండ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి,  హనుమకొండ జిల్లా ఎన్జీసీకోఆర్డినేటర్ లు సంయుక్తం గా కళాశాలల విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వినియోగం గురించి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈప్రచార కార్యక్రమంలో హనుమకొండ టీజీపీసీబీ నోడల్ అధికారి జీముత వాహన ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై పరిచయ ప్రసంగం చేసి, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వాడకాన్ని ప్రోత్సహించారు. పర్యావరణ అనుకూల జీవవిచ్ఛిన్నమయ్యే ఉత్పత్తులను, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లకు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను...