అభివృద్ధి పనులను వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలి
ఆయుధం న్యూస్ వరంగల్ వరంగల్ మహనగర పరిధిలోని చారిత్రక, పర్యాటక ప్రాధాన్యం కలిగిన రంగనాయక ఉర్సుగుట్ట ప్రాంతాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఉర్సుగుట్ట పరిసర ప్రాంతాల్లో కుడా ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. పర్యాటకులను ఆకర్షించేలా చేపడుతున్న మౌలిక సదుపాయాల...