ఇక నుండి రైతులకు ఉపయోగపడే కేంద్రాలుగా రైతు వేదికలు
ఆయుధం న్యూస్ హైదరాబాద్ రైతు వేదికలను ఇకపై రైతులకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలి. జిల్లాల్లో వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్షాలు, వ్యవసాయ సీజన్, తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి ఎంసీఆర్ హెచ్ఆర్‌డి...