ఆయుధం న్యూస్ హనుమకొండ,: హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయంలో రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కొనియాడారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించిందన్నారు. ద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా, దేశ ప్రజలను ఏకం చేసేందుకు ఆయన పడిన శ్రమ అమూల్యమైనదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ప్రజల కలలను సాకారం చేయాలని ఆకాంక్షించారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇ.వి శ్రీనివాస్ రావు, వరంగల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పులి ప్రియాంక, జిల్లా కమిటీ సభ్యులు అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.