పల్లి గింజ,కందిపప్పు పై యోగాసనాలు

ఆయుధం న్యూస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ కాశీబుగ్గ వివేకానంద కాలనీకి చెందిన మైక్రో ఆర్టిస్ట్ కుసుమ లింగమూర్తి జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని తనదైన శైలిలో కందిపప్పుపై,పల్లి గింజలపై యోగాసనాలు వేసారు.ఇప్పటివరకు చాలా సార్లు వివిధ ఆకృతులతో శనగపప్పుపై, బియ్యపు గింజలపై, ద్రాక్ష పళ్లపై, పెసరపప్పుపై కూడా అద్భుతమైనటువంటి కళాఖండాలను వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.సామాజిక కార్యకర్తగా ఆలయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గా ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ గా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి కళాఖండాలను తీర్చిదిద్దటంలో సిద్ధహస్తుడు.ఇతని ప్రతిభను...