వీఓ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి
ఆయుధం న్యూస్ హన్మకొండ గ్రామీణ మహిళా సంఘాల సాధికారత, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల విస్తరణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి తెలిపారు.శనివారం హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) - సెర్ప్ కన్వర్జెన్స్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ ఆర్గనైజేషన్ (వీఓ) భవనం నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ భూమిపూజ చేసి ప్రారంభించారు....