యోగాతో ఆరోగ్యం యోగాతో ఆనందం

ఆయుధం న్యూస్ గీసుకొండ:అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గీసుకొండ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారు. యోగా ట్రైనర్లు ఎన్.ఇందిర, అడప.సాంబశివరావు ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత, మహిళలు, గ్రామ ప్రజలు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక యోగా ఆసనాలు, ప్రాణాయామాలు నిర్వహించారు. “యోగాతో ఆరోగ్యం – యోగాతో ఆనందం” అనే సందేశంతో సాగిన కార్యక్రమం ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్‌కుమార్ మాట్లాడుతూ,...