ఓరుగల్లు కోటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ

ఆయుధం న్యూస్ వరంగల్, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రక కిలా వరంగల్ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రక ప్రాంగణంలో జరిగిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 500 మంది విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు.జిల్లా కలెక్టర్  సత్య శారద ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమని పేర్కొన్నారు. నేటి వేగవంతమైన...