ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ఆయుధం న్యూస్ హనుమకొండ : కేంద్ర అటవీ, పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో పాటు విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న “ఏక్ పేడ్ మా కే నామ్” (తల్లి పేరుతో ఒక మొక్క) కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సోమవారం కలెక్టరేట్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాల్సిన అవసరం ఉందన్నారు. తల్లి పట్ల ప్రేమ, గౌరవాన్ని చాటుతూ ఆమె పేరుతో ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించడం...