AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 4:48 pm Posted by : AYUDAM DAILY

వ‌రంగ‌ల్ మున్సిపల్ కమిషనర్‌గా వెంకన్న నియామకం

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప‌లువురు ఉన్న‌ధికారుల‌ను బ‌దిలీలు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ (HMDA)లో కోర్ అర్బన్ రీజియన్ మెట్రో రైల్ విభాగం జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న టి. వెంకన్న ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ నియమించింది.ఈ మేరకు ఇప్పటి వరకు జీడబ్ల్యూఎంసీ మున్సిపల్ కమిషనర్ పదవికి అదనపు బాధ్యతలు (FAC) నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.