మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఆయుధం న్యూస్ హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి,ఎంపీ వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మూసీ మొదటి దశ ప్రాజెక్ట్ పైన అధికారులు...