AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 8:05 pm Posted by : AYUDAM DAILY

2028లో తెలంగాణ బీజేపీ అధికారం ఖాయం బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
ప్రజల ఉత్సాహం చూస్తుంటే 2028లో తెలంగాణ బీజేపీ అధికారం ఖాయమ‌ని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ అశాభావం వ్య‌క్తు చేశారు,వ‌రంగ‌ల్ మ‌హ‌న‌గ‌రంలో హన్మకొండ ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో సొమావారం నాడు నిర్శ‌హించిన‌ బిజెపి బీజేపీ బూత్ అధ్యక్షుల ‘విజయసంకల్ప సమ్మేళనంలో జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పాతల్గొన్నారు.బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందిని తెలంగాణ ఈరోజు రాష్ట్రంగా ఉందటే సర్దార్ వల్లభాయి పటేల్ కృషి అన్నారు.ప్రజల ఉత్సాహం చూస్తుంటే 2028లో తెలంగాణ బీజేపీ అధికారం ఖాయమ‌ని అశాభావం వ్య‌క్తు చేశారు,తెలంగాణ ఏర్పాటుకు ఎటువంటి లాభపేక్ష లేకుండా బిజెపి సహకరించిందని,మేం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాడుతాం, మేము అధికారంలో ఉంటే ప్రజల కోసం పనిచేస్తామ‌ని ప్రతి ఇంటికి బీజేపీనీ తీసుకెళ్లడమే మీ ముందున్న ప్రధాన కర్తవ్యం అని అన్నారు.

రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటిషన్ అని బీజేపీ ప్రతి కార్యకర్త ఫుల్ టైమ్ పొలిటిషన్..

గత బిఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు చూశామ‌ని వాళ్ళు కేవలం కుటుంబం కోసమే పనిచేశారు… ప్రజల కోసం పనిచేయలేదని అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు ఆ ప్ర‌భుత్వ ఇప్పుడు హామీలు ఇవ్వడం, మర్చిపోవడం కాంగ్రెస్ నినాదంగా మారిందని హామీలు ఇవ్వడము మర్చిపోవడంను ఈ మూడేళ్ళు చూశామ‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

కేంద్రప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిఇంటికి చేర్చాలి…

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిల్లీకి ఎటిఎం గా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు బిజెపి శ్రేణులు చెప్పాలని కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీజేపీ కార్యకర్తలు పోరాటం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడితే డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని మాజీ ప్రధాని పీవీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదు.. ఆయన ఆవమానించింది కాంగ్రెస్ పీవీనీ అవమానిస్తే…బీజేపీ భారతరత్న ఇచ్చి గౌరవించింది చెప్పారు.కరోనా టైంలో 80 కోట్లమందిని రక్షించిన ఘనత ప్రధానమంత్రి మోడీది ఉగ్రవాదులు చోరబాడకుండా సర్జికల్ స్ట్రైక్ రూపంలో బీజేపీ ప్రభుత్వం పనిచేసిందని అన్నారు.

దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో బిజెపి కృషిచేసింది…

గత బీఆర్ఎస్ తప్పులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ డిఎన్ఎ లోనే అవినీతి ఉందిని
మత ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని దాన్ని మేము ఒప్పుకోం మ‌న్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో స్థానికులకు ఉద్యోగవకాశాలు వస్తున్నాయి ,గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కమలం జెండా ఎగరాలని 2028లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మునిసిప‌ల్ ఎన్నికలు సెమీఫైనల్స్ లాంటివ‌ని అందుకొసం ప్ర‌తి కార్య‌కర్త పార్టీ గెలుపుకొసం కృషిచేయాల‌ని పిలుపునిచ్చారు.వికసిత్ వరంగల్ వికసిత్ తెలంగాణ మన నినాదం అభ్యర్థుల గురించి ఆలోచించకండి.. బిజెపి జెండాను పట్టే అభ్యర్థులనే గెలిపించండిని కొరారు. ఈ స‌మావేశంలో కేంద్ర‌మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ కుమార్ పార్టీ అధ్య‌క్ష‌లు రాంచంద‌ర్ రావు జాతీయ కౌన్సిల్ స‌భ్యులు రాష్ట్ర నేత‌లు ప్ర‌జా ప్ర‌తినిధులు కార్య‌క‌ర్త‌లు పాల్గోన్నారు.