ఉపాధ్యాయురాలిగా మారిన జిల్లా కలెక్టర్
ఆయుధం న్యూస్ హనుమకొండ : ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలవాలని, విద్యార్థుల్లో పఠన సామర్థ్యం,గణిత నైపుణ్యాలు,ఆలోచనాశక్తిని పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి ఐదో తరగతి విద్యార్థులకు గణిత పాఠ్యాంశాన్ని బోధించారు. ఒక చేత్తో గణిత పాఠ్యపుస్తకాన్ని కలెక్టర్ పట్టుకొని మరో చేతితో చాక్ పీస్...