ధర్మసాగర్ రిజర్వాయర్‌ను పరిశీలించిన బల్దియా కమిషనర్ వెంకన్న

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌ గ్రేటర్ వరంగల్ నగరానికి తాగునీటిని అందిస్తున్న ప్రధాన జలవనరైన ధర్మసాగర్ రిజర్వాయర్ను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో ఉన్న ప్రస్తుత నీటి నిల్వలు, నగరానికి జరుగుతున్న తాగునీటి సరఫరా విధానం, నీటి శుద్ధి ప్రక్రియ, నీటి నాణ్యత, పంపింగ్ వ్యవస్థ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.వ‌రంగ‌ల్ నగర ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన తాగునీటిని నిరంతరం సరఫరా చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు....