AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 6:44 pm Posted by : AYUDAM DAILY

వ్యాపార సంస్థలు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మ‌హ‌ నగరంలోని వ్యాపార సంస్థలు (కమర్షియల్ నిర్మాణాలు) ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని బల్దియా కమిషనర్  వెంకన్న అభిప్రాయపడ్డారు.శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో డిఆర్ఎఫ్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్ధవంతంగా నిర్వహించుటకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డి ఆర్ ఎఫ్ అధికారులు ప్రతి నెల కచ్చితంగా పీరియాడికల్ తనిఖీలు చేపట్టాలని, నగరంలోని కమర్షియల్, రెసిడెన్షియల్ వాసులు ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించి రక్షణ పరికరాలు ఏర్పాటు చేసుకునేలా వారికి నోటీసులు అందజేసి స్నేహ పూర్వక వాతావరణం లో అవగాహన కల్పించాలని, నగర వ్యాప్తంగా ఫుట్ పాత్ లపై వ్యాపారాలు నిర్వహించకుండా అవగాహన కల్పించాలని, నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ వారి సహకారంతో తొలగించాలని, ప్రభుత్వ కార్యాలయాలపై అతికించిన వివిధ రకాల పోస్టర్ లను శానిటేషన్ సిబ్బంది సహకారంతో తొలగించాలని, భారీ వర్షాల నేపధ్యంలో సమాచారంలో జాప్యాన్ని నివారించడానికి ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ డి ఆర్ ఎఫ్ అధికారులకు వాకీ టాకీలను అందజేయడం జరుగుతుందని, డి ఆర్ ఎఫ్ సిబ్బందికి అవసరమైన సామాగ్రిని వసతులను కల్పించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు.నగరంలో భవన నిర్మాణాలకు అనుసరిస్తున్న విధి విధానాలను, నిర్మాణ క్రమంలో పాటించాల్సిన ఫైర్ సేఫ్టీ నిబంధనలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.అక్రమ నిర్మాణాల కూల్చివేతల తీరు ను సిటీ ప్లానర్ ను అడిగి తెలుసుకున్నారు. డి ఆర్ ఎఫ్ కంట్రోల్ రూం ను ఐసిసిసి కేంద్రంలో ఉండేలా ఏర్పాటు చేసి ఐ సి సి సి నియంత్రణలో పని చేసేలా చూడాలని, డి ఆర్ ఎఫ్ అధికారులు ప్రతి రోజు ఐ ఎం డి ( భారత వాతావరణ శాఖ) వారు అందించే వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటూ అందుకు సన్నద్ధం గా ఉండాలని అన్నారు.ఈ సమావేశం లో అదనపు కమిషనర్ జోనా, ఎస్ ఈ రాజ్ కుమార్ ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ డి ఎఫ్ ఓ శంకర్ లింగం, ఎస్ ఎఫ్ ఓ రాజేశ్వర్ రావు, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.