అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్య శారద
ఆయుధం న్యూస్ వరంగల్ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద గురువారం ఖిలా వరంగల్ మండలంలోని ఉరుసు, కరీమాబాద్ ప్రాంతాల్లో ఉన్న పలు అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టరేట్‌లో సీడీపీఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లల హాజరు, మౌలిక సదుపాయాలపై సమీక్షించిన కలెక్టర్, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు నేరుగా కేంద్రాలను సందర్శించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకం కింద నిల్వ ఉంచిన బియ్యం, పప్పు, నూనె, గుడ్లు, బాలామృతం ప్యాకెట్లను స్వయంగా పరిశీలించి స్టాక్ రిజిస్టర్‌తో...