వినూత్న డిజైన్లతో నాణ్యమైన వస్త్రాల తయారీతో అధిక లాభాలు సాధించాలి: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

ఆయుధం న్యూస్ హనుమకొండ,: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, మౌలిక వసతులు, అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను విస్తరించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.శుక్రవారం కాజీపేట మండలం మడికొండ ఇండస్ట్రియల్ పార్కులోని కాకతీయ టెక్స్టైల్ వివర్స్ వెల్ఫేర్ పొదుపు పరపతి పరస్పర సహాయక సంఘం, గ్రానైట్ పరిశ్రమలు, ఐటీ సెజ్‌ను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా...