తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శం: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

ఆయుధం న్యూస్ హనుమకొండ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం, ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని హనుమకొండ, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టిచాకిరీ, సామాజిక దోపిడీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన దొడ్డి కొమురయ్య తెలంగాణ ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. సమాజంలో...