AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 1:33 pm Posted by : AYUDAM DAILY

అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మంత్రి సవిత నివాళులు

ఆయుధం న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పార్టీ కార్యాలయంలో మంత్రి సవిత గారు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరంలో అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలు, గిరిజనుల హక్కులు మరియు ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని మంత్రి సవిత పేర్కొన్నారు. యువత అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.