ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్

ఆయుధం న్యూస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశించారు.వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం ఆమె తొలిసారిగా హనుమకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను తనిఖీ చేసి, వాటి స్వాధీనానికి గల కారణాలు, కేసుల పురోగతి గురించి సంబంధిత...