పారిశుద్ధ్య నిర్వహణలో నాణ్యతతో పాటు వేగం పెంచాలి
ఆయుధం న్యూస్ హన్మకొండ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, జంతు జనాభా నియంత్రణ కార్యక్రమాల పురోగతిని బల్దియా కమిషనర్ వెంకన్న మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ముందుగా బాలసముద్రంలోని బయో కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్, జీవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం, పొడి వ్యర్థాల వేరు చేసే కేంద్రాలను సందర్శించిన కమిషనర్, అక్కడ అమలవుతున్న ప్రక్రియలను పరిశీలించి నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తూ...