భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం
ఆయుధం న్యూస్ హైదరబాద్ భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహా రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నర్సింహారెడ్డి తుదిశ్వాస వరకు నీతినిజాయితీతో జీవించారని కొనియాడారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాలను నిర్వహించి నిత్యం ప్రజల పక్షాన నిలిచారని గుర్తుచేశారు. భూదానోద్యమానికి తన 300 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప మానవతావాదిగా స్మరించుకున్నారు. 1978, 1983 సంవత్సరాల్లో రెండుసార్లు భువనగిరి నుంచి శాసనసభకు...