ఎస్డిఎఫ్ నిధుల మంజూరు పత్రాలను గ్రామ సర్పంచులకు అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆయుధం న్యూస్ హన్మకొండ స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో ధర్మసాగర్ మండలంలోని సాయిపేట, క్యాతంపల్లి, తాటికాయల, నర్సింగారావుపల్లి, ఎల్కుర్తి, కరుణాపురం గ్రామాలలో అభివృద్ధి పనులకు మంజూరు అయిన ఎస్డిఎఫ్ నిధుల మంజూరు పత్రాలను ఆయా గ్రామ సర్పంచులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందజేశారు.సాయిపేట గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సిసి డ్రైన్ ల...