ఆషాడ బోనాల జాతర, ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం పోస్టర్ లను ఆవిష్కరించిన మంత్రి సురేఖ

ఆయుధం న్యూస్ హైదరాబాద్ లో ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా, కన్నుల పండువగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎల్లమ్మ అమ్మవారు బల్కంపేటలో కొలువై వుండటం తెలంగాణ రాష్ట్రానికి మంగళప్రదం అని మంత్రి అన్నారు. జూలై 20, 21, 22 తేదీల్లో నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవ సమన్వయ సమావేశంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ...