మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఆయుధం న్యూస్ ములుగు. రైతులకు అవసరమైన యూరియా ఎరువులను సకాలంలో అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ సేవను అందుబాటులోకి తీసుకువచ్చిందని ములుగు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లా రైతులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ముందస్తుగా యూరియా బస్తాలను బుక్ చేసుకోవాలని,ఇప్పటికే పలువురు రైతులు ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకుంటున్నారని తెలిపారు. యాప్ ద్వారా బుకింగ్ చేసే విధానం తెలియని రైతులు తమ సమీప మీసేవ...