నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
ఆయుధం న్యూస్ వరంగల్:గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన అంశాలను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుని, నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా బల్దియా పరిధిలోని రాంపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ) నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం వరంగల్ పరిధిలోని రామన్నపేటలో డ్రైనేజీ నిర్మాణ పనులు, వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపు ప్రక్రియను...