స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులకు రాష్ట్ర గవర్నర్ ప్రశంసలు
ఆయుధం న్యూస్ హనుమకొండ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా గురువారం సందర్శించి, మహిళల కృషిని అభినందించారు.గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (MEPMA), వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రదర్శించిన వివిధ ఉత్పత్తులను గవర్నర్ ఆసక్తిగా పరిశీలించారు. మహిళలు స్వయంగా తయారు చేసిన ప్రతి ఉత్పత్తి గురించి అడిగి తెలుసుకుంటూ, వాటి తయారీ విధానం,...