కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు చివరి లబ్ధిదారుని వరకు చేరేలా సమర్థవంతంగా అమలు చేయాలి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
ఆయుధం న్యూస్ హనుమకొండ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటి ప్రయోజనాలు చివరి లబ్ధిదారుని వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర గవర్నర్ సమీక్షా సమావేశం గురువారం నాడు నిర్వహించారు. సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం వందే మాతరం, తెలంగాణ...