ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం సహించేది లేదు జూలై 14లోపు 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
ఆయుధం న్యూస్ హనుమకొండ,: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి స్పష్టం చేశారు. శనివారం హనుమకొండ పట్టణంలోని గాంధీనగర్, అశోక్ కాలనీ, గోకుల్ నగర్, లష్కర్ సింగారం, లష్కర్ బజార్ తదితర ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ఎస్ఐఆర్ నమోదు ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులతో (బీఎల్ఓలు) మాట్లాడిన కలెక్టర్,...