ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
ఆయుధం న్యూస్ హనుమకొండ:ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు.సోమవారం హనుమకొండలోని వికాస్‌నగర్, సమ్మయ్యనగర్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్, పెండింగ్ వివరాలను సమీక్షించి అధికారులకు...