AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 4:39 pm Posted by : AYUDAM DAILY

ఆరోగ్య పరిరక్షణలో తోటి సిబ్బందికి స్పూర్తిగా నిలవాలి

ఆయుధం న్యూస్ వరంగల్:  ఆరోగ్య పరిరక్షణలో పోలీస్ క్రీడాకారులు తోటి సిబ్బందికి స్పూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ఐదవ రాష్ట్ర స్థాయిలో పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మొదటి క్లస్టర్‌లో మొత్తం 61 పతాకాలను సాధించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులకు సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయములో అభినందన సభ నిర్వహించారు.
ఈ సభకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గోని పతాకాలను సాధించిన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరుపున ప్రాతినిద్యం వహించి రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలను సాధించడం వరంగల్ కమిషనరేట్ గర్వించదగిన విషయమని ఇందుకు పతకాలను సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ, ఇదే స్పూర్తితో నిత్యం క్రీడల సాధనతో ఆరోగ్యంగా వుంటూ, మిమ్మల్ని అదర్శంగా తీసుకుని వారంలో మూడు నుండి నాలుగు రోజులు పాటు కొద్ది సమయాన్ని కేటాయించి క్రమశిక్షణతో తమ ఆరోగ్య పరిరక్షణకై కృషి చేసే విధంగా తోటి పోలీస్ సిబ్బందికి ప్రేరణ కలిగించాలని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.ఈ కార్యక్రమములో  అదనపు డిసిపిలు సురేష్‌కుమార్, శ్రీనివాస్,బాలస్వామి, ప్రభాకర్ రావు, ఏసిపి నాగయ్య, ఆర్.ఐ స్పర్జన్ రాజ్‌తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.