ఆరోగ్య పరిరక్షణలో తోటి సిబ్బందికి స్పూర్తిగా నిలవాలి
ఆయుధం న్యూస్ వరంగల్: ఆరోగ్య పరిరక్షణలో పోలీస్ క్రీడాకారులు తోటి సిబ్బందికి స్పూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ఐదవ రాష్ట్ర స్థాయిలో పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మొదటి క్లస్టర్‌లో మొత్తం 61 పతాకాలను సాధించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులకు సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయములో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గోని పతాకాలను సాధించిన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్బంగా...