ప్రభుత్వ సేవల నాణ్యత పెంపునకు అధికారులు ఏఐ సాధనాలను వినియోగించాలి
ఆయుధం న్యూస్ హనుమకొండ,: ప్రభుత్వ పరిపాలనలో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence–AI) వినియోగం ద్వారా కార్యనిర్వహణను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మార్చి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించవచ్చని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో టీ-ఫైబర్ సహకారంతో ప్రభుత్వ అధికారుల సామర్థ్యాభివృద్ధి లక్ష్యంగా "పరిపాలన సామర్థ్య పెంపునకు కృత్రిమ మేధస్సు (AI)" అంశంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రభుత్వ పరిపాలనలో వినియోగించడం కాలానుగుణ అవసరమని...