AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 6:26 pm Posted by : AYUDAM DAILY

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన ఎపి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

ఆయుధం న్యూస్ హైదరాబాద్
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్  గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్  పరామర్శించారు. గవర్నర్  గురువారం  హైదరాబాద్ లోని  పవన్ కళ్యాణ్  నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్  స్వగృహంలో ఉన్న లైబ్రరీని  గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్  తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు పరిశీలించారు. వాటి గురించి పవన్ కళ్యాణ్ తో ఆసక్తిగా చర్చించారు. పవన్ కళ్యాణ్  కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్  ఆటోగ్రాఫ్ చేశారు.గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్  ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు  పవన్ కళ్యాణ్  కృతజ్ఞతలు తెలియజేశారు.