ఆయుధం న్యూస్ వర్థన్నపేట
వర్ధన్నపేట మండలం, మున్సిపాలిటీ ఐనవోలు మండల BLA, సభ్యత్వ నమోదు సోషల్ మీడియా కార్యకర్తలతో SIR కార్యక్రమంపై సత్యం గార్డెన్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫామ్స్ పూర్తి చేయడంలో ఓటర్లకు అందుబాటులో ఉండాలని బీఎల్ఏలకు సూచించారు, క్షేత్ర స్థాయిలో ఉంటూ ఓటర్లను కలిసి వారికి సాయం అందించాలని అన్నారు, వీలైనంత తొందరగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా BLA లు భాధ్యత తీసుకోవాలని అన్నారు, SIR ప్రక్రియను సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని, బూత్ స్థాయి BLA ల సమన్వయాన్ని బలోపేతం చేయాలని, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి అని వారు పిలుపునిచ్చారు, బిఆర్ఎస్ పార్టీ నుండి ప్రతి బూత్ కు ఇద్దరు బిఎల్ఎ లను కేటాయించడం జరిగిందని వారు సమర్థవంతంగా SIR డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను BLO లా వెంట ఉండి ఓటరు జాబితా పక్రియను సమర్ధవంతంగా పునరుద్దించాలని సూచించారు, ఓటర్లకు ఉన్న సందేహాలు, సమాచారాన్ని ఆన్‌లైన్, ప్రింట్ ఓటర్ లిస్ట్‌ల ద్వారా ఓటర్లకు అందించాలని వివరించారు, ఇప్పటి వరకు వర్ధన్నపేట మండలం, మున్సిపాలిటీ , ఐనవోలు మండలం లోని అన్ని గ్రామాల పరిధిలో ఉన్న బూత్ లెవల్ ఏజెంట్ల నుంచి SIR పై పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ SIR, సభ్యత్వ నమోదు ఇంచార్జ్ మసూద్ , మాజీ జడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాములు, మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు తుల్ల కుమార్, తంపుల మోహన్, మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు గోధుమల మధు, చందర్రావు, మాజీ ఐనవోలు గుడి చైర్మన్ మజ్జిగ జైపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జు సంపత్ రెడ్డి, మాజీ ఆత్మ చైర్మన్ గోపాల్ రావు, కౌన్సిలర్స్ కుమారస్వామి, సురేష్, మాజీ సర్పంచ్ సురేష్, సుధాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.