గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు.

గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఉత్సవ వేదిక వద్దకు చేరుకున్న మంత్రి కి అర్చకులు మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్ర‌భ‌క‌ర్ తో కలిసి మంత్రి సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ శివసత్తులతో కలిసి అమ్మవారికి తొలి బోనం...