విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందించాలి
ఆయుధం న్యూస్ హనుమకొండ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థినులు ఉత్తమ విద్యా ఫలితాలు సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని, సులభంగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలను బోధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచించారు.గురువారం హనుమకొండ వడ్డేపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యా బోధన, విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.విద్యార్థినులకు బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా అందిస్తున్న మైసూర్ బోండాను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. ప్రతిరోజూ అందిస్తున్న బ్రేక్‌ఫాస్ట్,...